Thursday, January 16, 2014

My Review on 1 (Nenokkadine) Telugu Movie

వన్ నేనొక్కడినే సినిమా గురించి అందరూ తమకి తోచిన రివ్యూస్ రాస్తున్నారు. ఈ సినిమా నేను నిన్ననే చూడటం జరిగింది. ఈ సినిమా గురించి నా రివ్యూ ఇక్కడ రాస్తున్నాను.

డైరెక్టర్ సుకుమార్(?) ఈ సినిమాని చాలా కన్‌ఫ్యూజన్లో తీసారనిపిస్తుంది.టాలీవుడ్ సినిమాలో హాలీవుడ్ ఎఫెక్ట్స్ చూపించడానికి ప్రేక్షకుల్ని విపరీతంగా కన్‌ఫ్యూజ్ చేసినట్టుగా ఉంది. ఇంతకు ముందు కూడా ఆర్య,ఆర్య-2 లాంటి సైకో సినిమాలు తీసిన సుకుమార్ గారు ఈ సారి మహేష్ బాబుని మెంటల్ పేషంట్ లా చూపించడంలో సక్సెస్ అయ్యారు.

మహేష్ బాబు కూడా కన్‌ఫ్యూజన్లో ఈ పిచ్చి సినిమా యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంది,ఇంతకు ముందు సినిమాలకంటే ఇంకా బాగా చెయ్యాలని ఏం చెయ్యాలో పాలుపోక విదేశీ ప్రేక్షకుల కోసం ఈ సినిమాలో నటించినట్టనిపిస్తుంది.ఈ సినిమా తెలివి తక్కువ విదేశీ దద్దమ్మల కోసమైతే నంబర్ వన్ పొజిషన్లో నిలుస్తుంది గానీ తెలుగు ప్రేక్షకులకి సరిగ్గా కనెక్ట్ అవ్వదు.

ఇది సైకలాజికల్ థ్రిల్లర్ గా కన్నా సైకో కిల్లర్ లా ఎక్కువ పాయింట్స్ సాధిస్తుంది.మెదడులో గ్రే మ్యాటర్ తక్కువగా వున్న హీరో తెలివి తేటలకి పరీక్ష పెట్టే రూబిక్స్ క్యూబ్ తో అద్భుతాలు సృష్టించడం,తండ్రి లాకర్లో దాచిన రైస్ గ్రెయిన్ సంపాదించే ప్రయత్నంలో ఇంటర్నేషనల్ విలన్ తో యుద్ధాలు చెయ్యడం వింతగా అనిపిస్తుంది.

మురారి,అర్జున్,అతడు,ఒక్కడు,దూకుడు తరవాత మహేష్ బాబు ఎలాంటి క్యారక్టర్ అయినా చెయ్యగలరని నిరూపించుకున్నారు.ఆయన కథని సాంతం చదివి మరికాస్త మంచి స్క్రిప్ట్ ఆమోదిస్తే బాగుండేది.

మహేష్ కి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బాలీవుడ్ ఫాలోయింగ్ కి తక్కువ ఏం కాదు..ఆయన కోరుకుంటే హాలీవుడ్ సినిమాలో చెయ్యడం పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదని అనిపిస్తుంది.

సైకో కిల్లర్ లు అలవోకగా తీసే సుకుమార్ గారు సైకలాజికల్ థ్రిల్లర్స్ తీయడం మొదలు పెడితే రిజల్ట్ ఇలాగే వస్తుందనడంలో సందేహం లేదు,హీరోయిన్లు హీరోలని పడెయ్యడానికి వన్ డే గాళ్ ఫ్రెండ్స్ అవ్వడానికి కూడా తెగిస్తారని చూపించడం చాలా అమర్యాదకరంగా వుంది.హీరో వ్యాధితో హీరోయిన్,డాక్టర్ పిచ్చి పిచ్చిగా ఆటాడేసుకుంటారు! 

ముందు అర్జంటుగా సుకుమార్ గారికి ఇంటెగ్రిటీ డిజార్డర్ వుందేమో టెస్ట్ చెయ్యిస్తే బావుంటుందనిపిస్తుంది.

తెల్లారి లేచింది మొదలు నిద్ర పోయే దాకా ఇంగ్లీష్ సినిమా సీడీలు గుడ్లూడిపోయేలా చూసి ఒక పది పదిహేను కథల్ని మిక్సీలో వేసి తెలుగు ప్రేక్షకుల కోసం కలగూరగంప మసాలా కథలు వండుతున్న డైరెక్టర్లు అలాంటి ప్రయత్నాలు ఇప్పటికైనా మానేసి తెలివి పెంపొందించుకుని మంచి సినిమాలు తీయాలని ఆశిస్తున్నాను.

ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, గల్లీల్లో పెళ్ళి ఊరేగింపుకి వాయించే బ్యాండ్ మేళం వాళ్ళు వెయ్యి రెట్లు నయం,అసలు ఏ పాట ఎందుకు వింటున్నామో అర్థం కావట్లేదు..ఇవి కూడా ఇంగ్లీష్ ఆల్బంస్ నించి కొట్టుకొచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు,మ్యూజిక్ ట్రాకులు అయ్యుండచ్చు!  

హాలీవుడ్ ఎఫెక్టులు చూపించడం తప్పు కాదు,అది కేవలం ఎఫెక్టుల వరకే ఐతే పరవాలేదు,మొత్తం కథల్నే కాపీ పేస్ట్ చేసి వీళ్ళు సృష్టిస్తున్న కన్ ఫ్యూజన్ అంతా ఇంతా కాదు.

హాలీవుడ్ కంటే మెరుగైన టెక్నికల్ ఎఫెక్టులు మన తెలుగు వారు చూపించగలరని ఆశిద్దాం.

No comments:

Post a Comment