Thursday, January 23, 2014

1 (నేనొక్కడినే) డైరెక్టర్ నేనైతే..

నా ముందరి పోస్ట్ లో వన్ సినిమా మీద నా రివ్యూ రాసాను. ఈ సినిమా గురించి చాలా మంది చాలా రకాలుగా రివ్యూస్ రాస్తున్నారు కాబట్టి నేను రివ్యూస్ వదిలేసి మళ్ళీ అదే విషయం మీద కొంత క్రియేటివ్ గా రాద్దామని ప్రయత్నిస్తున్నాను.

నేను కథ లేకపోయినా సినిమాలు చూస్తాను,కథనం ఇంట్రస్టింగ్ గా వుంటే చాలు.

మహేష్ బాబు గారు ఇప్పుడు పాపులర్ యాక్టర్.ఆయనకి వున్న ప్లస్ పాయింట్స్ ఆకట్టుకునే అందం,అందరూ వెళ్ళిన దారిలో కాకుండా కొత్తగా ఏదైనా చెయ్యాలనే తపన,ధైర్యం.ఆయన హైట్ కి యాక్షన్ సినిమాలు అతికినట్టుగా సరిపోతాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఆయన ప్రభుదేవాలా డ్యాన్స్ చెయ్యలేరు.పేజీల కొద్దీ డైలాగులు చెప్పరు.కొన్ని సినిమాల్లో డైలాగ్స్ సరిగ్గా వినిపించవు,లో-వాయిస్ లో చెప్తారు.

వీటిలో డైలాగ్ డెలివరీ సరి చేసుకోవచ్చు.మైక్ దగ్గర యాంప్లిఫయర్ పెట్టడం ద్వారా ఆయన లో-వాయిస్ లో డైలాగ్ చెప్పినా దాని శృతి పెంచి వినిపించేలా చెయ్యొచ్చు. ఈ టెక్నిక్స్ నాకంటే ఎక్కువ సినిమా టెక్నిషియన్స్ కే తెలుస్తాయి. నేను కేవలం వ్యూయర్ ని మాత్రమే,కనీసం షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవం కూడా లేదు.ఐనా సరే ఒక డైరెక్టర్ కి చెప్పేంత ధైర్యమా అని అనుకోవచ్చు,నాకు ఎలా వుంటే బావుంటుందనిపించిందో చెప్పడానికి మాత్రమే ఈ చిన్న ప్రయత్నం.

1 సినిమా మూస సినిమాలకంటే భిన్నంగా వున్న మాట నిజం,ఐతే దీన్లో ఇంకొన్ని బెటర్‌మెంట్స్ చేసి వుంటే ఇంకాస్త బావుంటుందని నా అభిప్రాయం.సినిమా తీసేప్పుడు పదో క్లాస్ పిల్లాడికి అర్థం చెయ్యించగలిగేంత నాలెడ్జ్ వుంటే చాలు.ఎందుకంటే మహేష్ అభిమానుల్లో చాలా మంది యువతరం అబ్బాయిలే! అమ్మాయిలు కూడా అనుకోండి! కానీ మహేష్ గారికి అన్ని వయసుల వారూ అభిమానులే. 10-70 ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ అర్థమయ్యేట్టు తియ్యడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు.

ఈ సినిమాలో బ్రహ్మానందం మార్క్ కామెడీ లేదు,అలాంటి కామెడీ ఈ సినిమాకి సరిపోదు కూడా! ఐతే హీరో-హీరోయిన్ల మధ్యే కొన్ని సరదా సన్నివేశాలు ఎక్కువగా వుంటే ఇంకాస్త బావుండేది.

ఇక కథనం విషయానికి వద్దాం-

ఫస్ట్ సీన్ లో రైమ్ తో ఇంటికి దారి కనుక్కున్న మహేష్ ని చూపిస్తే ఫస్టాఫ్ లో పజిల్ సాల్వ్ చేసిన హీరో కనిపించేవాడు-అదే ఈ సినిమాలో ముఖ్యమైన మలుపు కూడా!     

హీరో వాళ్ళ నాన్నగారు సైంటిస్ట్ కాదు..కానీ కొత్తరకం వరి వంగడం కనుక్కున్నట్టు చూపించారు. నిజానికి శాస్త్రవేత్తలు మాత్రమే కొత్త విషయాలు కనుక్కోవాలని నియమమేమీ లేదు.ఒక సామాన్యుడు అసామాన్యమైన పని చెయ్యవచ్చు. ఒక బోయవాడు చలించి కావ్యాలే రచించాడు కదా! ఐతే ఆ వరి వంగడం కనుక్కోవడానికి కొంత బ్యాక్ డ్రాప్  ఇస్తే బావుండేది. ఆయన పేపర్లో భారతదేశంలో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యల గురించిన వార్తలు చూసి చలించిపోయి కొత్తరకం వరిని చేసినట్టు చూపిస్తే బావుండేది.

హీరోకి మానసిక వ్యాధి విషయానికొద్దాం,అతనికి ఎలాంటి వ్యాధీ లేదు. నిజం-అబద్ధం మధ్యలో ఏది నిజమో-ఏది అబద్ధమో తెలియక నలిగిపోతున్న క్యారక్టర్ మాత్రమే. అలాంటి మనిషిని డాక్టర్ అవహేళనగా మాట్లాడాల్సిన అవసరం లేదు,అతనికున్న డిజార్డర్ గురించి సరిగ్గా వివరాలు ఇస్తే బావుండేది.

హీరో తన ఇల్లు కనుక్కుని వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకున్నాడు కదా! ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.

తన తల్లిదండ్రులు చనిపోయాక ఇండియాలో వున్న పిన్నీ-బాబాయ్ ల దగ్గరో,అత్త-మామల దగ్గరో పెరిగినట్టు ఒక చిన్న బ్యాక్ డ్రాప్ ఇస్తే సరిపోయేది-ఒక రెండు నిమిషాలది..

ఇక హీరో ఒక రాక్ స్టార్, సహజంగానే ఇక్కడ తెలుగు మెలొడీ పాటలు పెడితే చిరాగ్గా వుంటుంది.రాక్ స్టార్ కి రాక్ పాటలే వుండాలి.అలాంటప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కన్నా ఇళయరాజా గారినో,శంకర్-ఎహసాన్-లాయ్ త్రయాన్నో నియమించి వుంటే బావుండేది. "దిల్ చాహతా హై" లో ఎక్కువగా పాశ్చాత్య బాణీలే వినిపిస్తాయి. అలాంటి మ్యూజిక్ ఇలాంటి సినిమాకి బాగా క్లిక్ అవుతుంది. బీట్ ఎక్కువగా వున్నా సాహిత్యం వినిపించేలా వుంటే తప్పకుండా ప్రేక్షకులు వింటారు.

ఏది నిజమో-ఏది అబద్ధమో తెలియక సతమవుతున్న హీరోని హీరోయిన్ ఆడుకుంటుంది.ఆమె అలా చేసి వుండకపోతే ఇంకా బావుండేది.దాని బదులు అతనికి కొన్ని పజిల్స్ ఇచ్చి వాటిని పూర్తి చెయ్యించి అతనిలో ఆత్మవిశ్వాసం నింపే అమ్మాయి కావాలి.హీరోయిన్ అలాంటి పనులు చేసినట్టు ఎక్కడా కనిపించదు-అల్లరి చిల్లర పనులు చేసింది మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది.హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యం లేదు కాబట్టి కొన్ని చిలిపి సన్నివేశాలు సరిపోతాయి.

సెకండ్ హాఫ్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు,విలన్స్ ని ఛేజ్ చేసి,నాజర్ సృష్టించిన అబద్ధాన్ని క్రాక్ చేసి రైస్ సాంపిల్ ని తిరిగి సాధించడమే! ఇక్కడ హీరో తన తెలివి తేటల్ని పూర్తిగా వినియోగించుకున్నాడు కాబట్టి సెకండ్ హాఫ్ బావుంది.

2 comments:

  1. why dont you direct a new film, your thoughts are awesome
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete